సత్యం రామలింగరాజుకు ఏడేళ్ల జైలుశిక్ష
దేశంలో సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణంలో సత్యం రామలింగరాజుకు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. ఏ1 నుంచి ఏ10 వరకూ ఉన్న మొత్తం పది మందికీ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. వీరిలో కొందరికి రూ.25 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు కోర్టు జరిమానా విధించింది. సత్యం రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజుపై ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5 కోట్లు జరిమానాను కోర్టు విధించింది. 2006లోనే ఈ కుంభకోణానికి అంకురం పడింది. కాని ఆ తర్వాత మూడేళ్లకి రామలింగరాజు స్వయంగా తాను ఈ కుంభకోణానికి పాల్పడినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఈ కేసు గురించి తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాషా్ట్రలతోపాటు ఢిల్లీనుంచి వచ్చిన విలేఖరులతో ఆ ప్రాంగణం నిండిపోయింది. కొంతమంది విదేశీ పాత్రికేయులు కూడా ఈ కేసు మీద ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








